బిర్యానీ, పాన్ తినడానికే రాహుల్ రాక

  • అండగా ఉన్న ప్రజలను ప్రతిసారి ముంచిన గాంధీలు
  • వారితోనే తెలంగాణకు తీరని మోసం 
  • బోధన్​ సెగ్మెంట్​ రోడ్ ​షోలో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్ ​లీడర్ ​రాహుల్​గాంధీ హైదరాబాద్​ బిర్యానీ, పాన్​ తినడానికి వచ్చిన గెస్ట్​ అని, ఇందుకోసం  ఎప్పుడైనా రావొచ్చని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఆదివారం ఆమె బోధన్​ సెగ్మెంట్​లోని నవీపేట, ఎడపల్లి మండలాల్లో జరిగిన రోడ్​షోలో, అర్బన్​లోని 50వ డివిజన్​లో మాట్లాడారు. నమ్మిన ప్రతిసారి తెలంగాణ ప్రజలను గాంధీ కుటుంబీకులు మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడం వల్లే వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.

కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఉన్నప్పుడు మత ఘర్షణలు జరిగేవని, సీఎం కేసీఆర్ వచ్చాక పదేండ్లలో ఎక్కడా లా అండ్​ఆర్డర్​ ఇష్యూ రాలేదన్నారు. ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందన్నారు.

ముస్లింలను ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారన్నారు. కేసీఆర్ గరవ్నమెంట్​వచ్చాక మైనార్టీల కోసం రూ.13 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. 2.31 లక్షల గవర్నమెంట్​జాబ్స్​భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని, ప్రైవేటు రంగంలో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. మంచి వాళ్లను ఎన్నుకుందామా? ముంచెటోళ్లను ఎన్నుకుందామా? ఓటర్లే ఆలోచించాలన్నారు. తము మరోసారి అధికాకంలోకి రాగానే పెద్ద ఎత్తున డబుల్ ​బెడ్​ రూమ్ ​ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.అభ్యర్థులు షకీల్, గణేశ్​గుప్తా పాల్గొన్నారు.