గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది : ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గవర్నర్ తీరు చాలా బాధాకరం అన్నారు. గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తీరు సరికాదన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పారు ఎమ్మెల్సీ కవిత.

ALSO READ : వానకు..పుస్తకాలు తడిసినయ్

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సిఫారసు చేసిన గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని స్పష్టం చేశారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తెలిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కింద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను ఆమోదించాల్సిందిగా గతంలో కేబినెట్ కోరింది. ఆ సిఫార్సులను గవర్నర్ తమిళిసై రిజెక్ట్ చేశారు.