ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వచ్చింది ఈడీ నోటీసు కాదు మోడీ నోటీసు అన్నారు ఎమ్మెల్సీ కవిత. దాన్ని పెద్దగా సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈడీ నోటీసుపై తమ లీగల్ టీం పరిశీలిస్తుందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ఏడాది కాలంగా టీవీ సీరియల్ గా సాగదీస్తున్నారు. కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి కొత్త ఎపిసోడ్ తీస్తున్నారంటూ చురకలంటించారు. ఇది రాజకీయ కక్షతో పంపించిందని స్పష్టం చేశారు.
Also Read :- ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వచ్చిన ఈడీ నోటీసుపై లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లీగల్ టీమ్ సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతామన్నారు. తమ లాయర్లు ఏం చెప్తే అలా చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత.
తాము ఏ పార్టీకి బీ టీమ్ కాదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేంద్రంలో అమిత్ షాతో సమావేశం అయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎవరితో సమావేశం అవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ప్రజలతో అభివృద్ధి కోసమే సమావేశం అవుతామని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు సెప్టెంబర్ 14వ తేదీన ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.సెప్టెంబర్ 15న ( శుక్రవారం )న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఇప్పటికే ఈడీ కవితను మూడు సార్లు విచారించింది. మార్చి 16,20,21 తేదీల్లో కవితను విచారించిన ఈడీ..ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేసి సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించింది.