కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చి అబద్దాలు మాట్లాదడతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అమిత్ షా కాదు.. అబద్దాల షా అని కవిత ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ కు మద్దతుగా 2023, నవంబర్ 25వ తేదీ శనివారం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు.
షుగర్ ఫ్యాక్టరీని మూసిందే భారతీయ జనతా పార్టీ ఎంపీ అని.. ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మళ్లీ ఇప్పుడు ఫ్యాక్టరీని తెరిపిస్తానని మీరు చెప్తున్నారా? అని మండిపడ్డారు. ఎయిరిండియాతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మేసిన బీజేపీ.. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామంటే నమ్మేందుకు ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఈ పదేళ్లలో ఎన్నో సంక్షేమాల పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపామని ఆమె చెప్పారు.