సింగరేణిని బీజేపీ సర్కార్​ అమ్మకానికి పెట్టింది: ఎమ్మెల్సీ కవిత

పెద్దపల్లి, రామగిరి, వెలుగు: బీజేపీ సర్కార్​ సింగరేణిని అమ్మకానికి పెట్టిందని, కాంగ్రెస్​ హయాంలో ఆ సంస్థ దివాలా తీసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సింగరేణిని సీఎం కేసీఆర్ లాభాల బాట పట్టించాడని తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు రామగిరి మండలం సెంటనరీ కాలనీలో కవిత రోడ్ షో నిర్వహించారు. అనంతరం రామగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

 ఆ ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్టు కూడా ఖర్చు కాలేదని, విపక్షాలు  మాత్రం లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రచారం చేయడం సరి కాదన్నారు. మంథని నియోజక వర్గంలో పుట్ట మధును గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.