హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోవడం సరికాదని ఎమ్మెల్సీ కవిత ఓ ప్రకటనలో అన్నారు. కేంద్రం చెప్పిన జనగణన, డీలిమిటేషన్సాకు వల్ల బిల్లు అమలుకు ఇంకొన్నేళ్ల పాటు ఎదురుచూడక తప్పని పరిస్థితి నెలకొందన్నారు. జనగణననే పరిగణలోకి తీసుకోవాలి అనుకుంటే 2011 సెన్సెస్ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలిపారు.
2026 తర్వాత జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనను సాకుగా చూపి బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. కానీ ఇది ఆ పార్టీకి ఏమాత్రం లాభం చేయబోదని తెలిపారు. తమిళనాడులో జయలలిత, పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ సీఎంలుగా ఉన్నారు కాబట్టి మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కవిత డిమాండ్చేశారు.