కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క

కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క
  • రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించిండు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో నిధుల వరద పారేదని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం, మంత్రులు పోటీపడి తిడుతున్నారన్నారు. “కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి అంటున్నరు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. ఆయన వేగుచుక్క అని రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చిన శక్తి  కేసీఆర్” అని కవిత పేర్కొన్నారు.

కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులతో సోమవారం ఆమె తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా లీగల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నామని, సోషల్​ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతున్నదన్నారు.

కాగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ హామీని విస్మరించారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు సోమవారం ఎమ్మెల్సీ కవితను కలిశారు.