ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్​ విఫలం : ఎమ్మెల్సీ కవిత

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్​ విఫలం : ఎమ్మెల్సీ కవిత

ధర్పల్లి, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలం అయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాజీ ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్ తో కలిసి  ధర్పల్లి మండలంలోని రామడుగులో బీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మహిపాల్​ యాదవ్​ కూతురు ఎంగేజ్​మెంట్​ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..  రేవంత్​రెడ్డి ప్రభుత్వం రైతుభరోసా, రుణమాఫీ, పథకాలు పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్​ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. 

కేసీఆర్​ పాలనలో రైతులు, అన్నీ వర్గాల ప్రజలు సంతోషంతో ఉన్నారన్నారు. నాలుగు స్కీంలను సెక్రటెరియేట్ లోని ఏసీ రూముల్లో కూర్చుని లబ్ధిదారులను ఎంపిక చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో  మాజీ జడ్పీటీసీ సభ్యుడు, బీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.