వీ6, వెలుగును బీఆర్ఎస్ పార్టీ కార్య క్రమాలకు పిలవొద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కసు వెళ్ల గక్కారు. 2023 జూన్ 07న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన సాగునీటి ఉత్సవాల్లో కవిత పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వార్తలు రా స్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆ మీడియాను ఎప్పుడో బ్యాన్ చేశారని, ఇకపై వారిని పిలవొద్దని, వాళ్లకు యాడ్స్, బైట్స్ ఇవ్వొద్దని సూచించారు. వెలుగు పత్రికకు యాడ్స్ ఇవ్వొద్దని అన్నారు. వీ6, వెలుగుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అన్నారు. వెలుగు పేపర్ కాదని, అది చీకటి అని అభివర్ణించా రు. ఇకపై బీఆర్ఎస్ కార్యకర్తలెవరూ వీ6 చూడొద్దు, వెలుగు పేపర్ చదవొద్దని ఆదేశించారు.