
కామారెడ్డి: నేను కేసీఆర్ అంతా మంచి వ్యక్తిని కాదని.. తాను కొంచెం రౌడీ టైప్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొందరు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని.. వాళ్లందరి పేర్లను పింక్ బుక్లో నోట్ చేసుకుంటున్నామన్నారు. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిన ఏ అధికారి, కార్యకర్తలను వదిలి పెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన మంగళవారం (ఏప్రిల్ 15) బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక తెలంగాణ కుంభ మేళా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మా పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే మాటల ప్రభుత్వమని.. 15 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్కు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
►ALSO READ | ఎవరేం మాట్లాడినా నో యూజ్.. హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: ఎమ్మెల్యేలకు CM రేవంత్ వార్నింగ్
డబ్బులు, అధికారం కోసమే కొందరు కాంగ్రెస్లోకి వలస వెళ్లారని పరోక్షంగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని విమర్శించారు. బాన్సువాడలో ఉప ఎన్నిక వస్తే గులాబీ జండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారని అన్నారు.