కేసీఆర్​ స్కీమ్​లపై అవగాహన కల్పించాలి : కల్వకుంట్ల కవిత

  • షకీల్​ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి


బోధన్, ;వెలుగు: కేసీఆర్​స్కీమ్​లను యువత ప్రజల్లో తీసుకెళ్లి, వారిలో చైతన్యం కలిగించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. గురువారం బోధన్ లోని​ శక్కర్​నగర్​లో జరిగిన నియోజకవర్గ యువగర్జన సభలో ఆమె మాట్లాడారు. హనుమంతుడి గుడిలేని ఊరు, కేసీఆర్​పథకాల లబ్ధి పొందని ఇల్లు ఉండదన్నారు. ఎమ్మెల్యే షకీల్​ను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కవిత పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  కాంగ్రెస్ ​హయాంలో 2004 నుంచి 2014 వరకు 24 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే, అందులో 10 వేల మందికే తెలంగాణ వారికి ఉద్యోగాలొచ్చాయన్నారు.

ప్రత్యేక రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి,లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ  చేశామన్నారు. బోధన్​లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్​రెడ్డి గతంలో ఇరిగేషన్​ మంత్రిగా పనిచేసినా బోధన్​కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదన్నారు. సీఎం కేసీఆర్​ తెలంగాణ  ప్రజల కోసం రైతు బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీ బంధు లాంటి అనేక పథకాలు అమలు చేసి, వివిధ వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్​ టౌన్ ​ప్రెసిడెంట్​రవీంద్ర యాదవ్, జడ్పీవైస్​చైర్మన్​  రజిత యాదవ్, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దవార్​గంగారెడ్డి, శరత్, మున్సిపల్ ​వైస్​ చైర్మన్ సోహెల్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : బీఆర్​ఎస్​ నిరుద్యోగులను మోసం చేసింది : బోగ శ్రావణి