నిమ్స్​ హాస్పిటల్కు కవిత

నిమ్స్​ హాస్పిటల్కు  కవిత
  • గురుకుల విద్యార్థినికి పరామర్శ
  • ఆరోగ్య పరిస్థితిపై ఆరా

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత నిమ్స్​హాస్పిటల్​కు వెళ్లారు. కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్​అందించాలన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శైలజ పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ALSO READ | హరీశ్ రావు గుర్తు పెట్టుకో.. రేవంత్ నమ్మకం.. భట్టి బ్రాండ్: కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి