జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. మందుగా బేతాళ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అంజన్నను దర్శించుకొని మెుక్కులు తీర్చుకున్నారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా 41 రోజుల నుంచి కొండగట్టులో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా కవిత 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి.. వేద పండితుల చేత ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.
జీవితాన్ని ప్రసాదించటంతో పాటు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, విజయాన్ని, సంపూర్ణ కీర్తిని ఆంజనేయ స్వామి అందిస్తాడని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హనుమంతుడిని కొలిస్తే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని ఆమె చెప్పారు. అందుకే తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందని తెలిపారు.