న్యూఢిల్లీ: తీహార్ జైలునుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్ చేశారు. జైలు తెలంగాణ అంటూ మీడియాతో మాట్లాడిన కవిత.. నన్ను నిరాధార ఆరోపణలతో జైలు పాలు చేశారు.నిరాధార ఆరోపణలతో నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారు. నేను కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు..18 యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఉద్యమ కుటుంబం నుంచి వచ్చాను.. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు. తనను, తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో దాదాపు ఐదు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. భర్తను, కొడుకు, కేటీఆర్ తో కన్నీరు పెట్టుకున్నారు.
కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు దగ్గరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చారు. గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బాల్క సుమన్, ముత్తిరెడ్డి, కౌశిక్ రెడ్డి, సహా పలువురు జైలు దగ్గర ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. ఆగస్టు 28 మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత.