రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా

రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రా
  • సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఎమ్మెల్సీ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన  బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విత్ డ్రా చేసుకున్నారు. సీబీఐ కేసులో కవిత పాత్రపై ఇటీవల ఆ దర్యాప్తు సంస్థ సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో కవితతో పాటు మరో నలుగురిపై అభియోగాలు మోపింది. అయితే, ఆ చార్జ్ షీట్ లో అన్ని తప్పులే ఉన్నాయని, అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని జులై 6న కవిత రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, చార్జ్ షీట్ ఫైలింగ్ మాత్రమే సరిగాలేదని, కోర్టు ఆదేశాలతో సరైన పద్ధతిలో ఫైలింగ్ చేశామని సీబీఐ వాదనలు వినిపించింది.

ఆ వాదనతో ఏకీభవించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు జులై 22న ప్రకటించారు. అనంతరం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతుండగా.. రెండు సార్లు వాయిదా పడింది. చివరిసారిగా సోమవారం విచారణ జరగాల్సి ఉండగా సీనియర్ అడ్వొకేట్ రాలేదని, మరో తేదీన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కవిత తరఫున అడ్వొకేట్ కోర్టకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి పై జడ్జి అసంతృప్తిని వ్యక్తం చేశారు.  మరోసారి వాయిదా వేయలేమని.. ఈ నెల 7న తుది వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు. దీంతో  బుధవారం బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉండగా.. మంగళవారమే పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్టు కవిత అడ్వొకేట్లు కోర్టుకు తెలిపారు.

చట్ట ప్రకారం తనకు ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నందున, బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టుకు నివేదించారు. అయితే.. ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది. అందుకే.. ట్రయల్ కోర్టులో పిటిషన్ విరమించుకున్నట్టు సమాచారం. మరోవైపు సోమవారం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో సానుకూల తీర్పు వస్తే.. దాని ఆధారంగా బుధవారం ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించాలని భావించారు. కానీ.. కేజ్రీవాల్ కు చుక్కెదురు కావడంతో బెయిల్ పిటిషన్ ను విరమించుకున్నారు.