పసుపు బోర్డు గొప్పలకేనా..నిధులివ్వరా?..కేంద్రంపై కవిత ఆగ్రహం

పసుపు బోర్డు గొప్పలకేనా..నిధులివ్వరా?..కేంద్రంపై కవిత ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. బోర్డుకు పైసా కూడా కేటాయించకపోవడం దారుణమని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పైసెస్, టీ, కాఫీ, రబ్బర్ బోర్డులకు నిధులు కేటాయించి, పసుపు బోర్డును గాలికొదిలేసిందని విమర్శించారు. 

నిజామాబాద్ పసుపు రైతులను మోసగించిందని, నిధులు లేని పసుపు బోర్డు ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను మరోసారి నిరూపించుకుందని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులకు, సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వరా అని ప్రశ్నించారు.