తెలంగాణ సాధించుకున్న దాంట్లో అందరి పాత్ర ఉందని.. ఏ ఒక్కరు పోరాడితేనో రాష్ట్ర రాలేదని ఎమ్మెల్సీ కోదండ రామ్ అన్నారు. BRS పదేళ్ల పాలనలో పరాయి వాళ్ళం అయిపోయామని హుజురాబాద్‌లో పౌర సమాజంతో మాటా ముచ్చట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం భార్యాభర్తలు గోప్యంగా మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిందని కోదండ రామ్ ఆరోపించారు. పౌర సమాజంతో మాటా ముచ్చట ప్రొగ్రామ్ కు ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితేల ప్రణవ్ హాజరైనారు.
పది సంవత్సరాల పాటు తెలంగాణ కోసం కొట్లాడినమనే విషయాన్నే మరచిపోయామని అన్నారు ఎమ్మెల్సీ కోదండ రామ్. కొట్లాడి అరాచక పాలనను అంతమొందించి, ప్రజా పాలన ప్రభుత్వాన్ని తెచుకున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వంతో సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. హక్కులకు నష్టం కలిగిస్తే ఎందుకు ఊరుకుంటాం.. పోరాటం చేస్తామన్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంద లేదా దీనిపై స్పష్టత రావాలని ఆయన చెప్పారు. వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు పోరాటం ఎందుకని కోదండరామ్ ఆందోళనకారులను ప్రశ్నించారు.
Also Read :- సుప్రీంకోర్టు తీర్పుతో మాలల్లో ఐకమత్యం వచ్చింది
రూ.6 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏమి చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అప్పు అయింది.. కానీ, 50 వేల ఎకరాలకు కూడా నీరు పారలేదని ప్రొ. కోదండరామ్ అన్నారు. ఎక్కువ ధరతో కరెంట్ కొనుగోలుతో విద్యుత్ శాఖ కుదేలైపోయింది. మిషన్ భగీరథలో అప్పులు అయ్యాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలపై పోరాడిన జర్నలిస్టులకు ఇళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. హుజురాబాద్ ని పీవీ జిల్లాగా ఏర్పాటు కోసం కృషి చేస్తామన్నారు. తనకు ఉద్యమకారుడిగానే ఎమ్మెల్సీ పదవి వచ్చిందని.. వ్యక్తిగతంగా రాలేదని కోదండ రామ్ అన్నారు.