
- విద్యా కమిషన్ సెమినార్లో వక్తలు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)తో విద్యారంగం మరింత కమర్షలైజ్ అవుతుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ఎన్ఈపీ–2020పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ..ఈ పాలసీ రాష్ర్టాలకు విద్యావిధానాన్ని నిర్వహించే హక్కును ఇవ్వడం లేదన్నారు. సిలబస్, సెంట్రలైజ్డ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వంటివన్నీ ఆందోళన కల్గించే అంశాలని వెల్లడించారు.
తీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్ పర్సన్ శాంతసిన్హా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపీ డాక్యుమెంట్ పై రాష్ట్ర ప్రభుత్వాలతో గానీ, పార్లమెంట్ లోగానీ చర్చించలేదని చెప్పారు. కేవలం కేంద్రమంత్రి వర్గం మాత్రమే ఆమోదించిందని తెలిపారు. భారత విద్యావ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఎన్ఈపీ లేదని వెల్లడించారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ..ఎన్ఈపీ అనేది ప్రభుత్వ నిధులతో నడిచే విద్యావ్యవస్థను కూల్చేసి, విద్యార్థులు, పేరెంట్స్ పై భారం మోపడమే లక్ష్యంగా తీసుకొచ్చిన విధానమని ఆరోపించారు.
విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కమిషన్ సభ్యుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.., 66 పేజీల ఎన్ఈపీ పత్రంలో విద్యాహక్కు గురించి ప్రస్తావనే లేకపోవడం బాధాకరమని చెప్పారు. సదస్సులో అగ్రికల్చర్ వర్సిటీ వీసీ జానయ్య, ప్రొఫెసర్లు హరగోపాల్, రమ మెల్కోటే, తిరుమలి, పద్మజాషా, ఉపేందర్ రెడ్డి, భూక్యా భంగ్యా , జిలానీ తదితరులు పాల్గొన్నారు.