కులగణనను స్వాగతిస్తున్నం : ఎమ్మెల్సీ కోదండరాం

కులగణనను స్వాగతిస్తున్నం : ఎమ్మెల్సీ కోదండరాం
  •   గత ప్రభుత్వం నుంచే  డీఏలు, ఫీజు బకాయిలు పెండింగ్​లో ఉన్నాయ్
  •  బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల చెల్లించడంలో లేట్​అవుతుంది 
  •   మూసీ ప్రక్షాళన అద్భుత కార్యక్రమం

హైదరాబాద్:  బీసీ కులగణన పారదర్శకంగా జరిపి,  దీని ఆధారంగానే  స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం కోరారు. ఇవాళ నాంపల్లి లో పార్టీ ఆఫీస్​లో ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. కులగణనను తాము స్వాగతిస్తున్నామన్నారు. ‘బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఎక్కడ పోయిందో . ప్రజల మధ్య సమగ్ర కుటుంబ సర్వే పెట్టలేదు.  

ALSO READ | రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్: దీపావళికి డబుల్ ధమాకా

బీఆర్ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్​చేసిన స్కీంలు, ప్రాజెక్టులను ఇప్పుడు విమర్శిస్తోంది.. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల  హాస్టల్ ల అద్దెలు చెల్లించడంలో కాస్త జాప్యం అయింది. ఆరోగ్య శ్రీ,  స్టూడెంట్స్​ఫీజుల బకాయిలు , ఉద్యోగుల డీఏలు గత ప్రభుత్వం నుంచే పెండింగ్ లో ఉన్నాయి.  మూసీ ప్రక్షాళన అద్భుతమైన కార్యక్రమం.ఆర్ఓఆర్ బిల్లుపైన అధ్యయనం చేస్తున్నం.  నదులు, చెరువుల పునరుద్ధరణ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ దక్కాలి. పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటాం’ అని కోదండరాం అన్నారు.