సిద్దిపేట, వెలుగు : మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీలతో నిర్మించాల్సిన అవసరం లేదని చెప్పినా అప్పటి ప్రభుత్వం వినిపించుకోలేదని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. పరిధిని తగ్గిస్తే నిర్వాసితుల సంఖ్య తగ్గుతుందని, భూకంపాలు కూడా తగ్గిపోతాయని చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై జస్టిస్ గోష్ కమిషన్ ఎంక్వైరీ చేస్తోందని చెప్పారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులపై కొండి మల్లారెడ్డి రాసిన ‘గూడు చెదిరిన దృశ్యం’ కవితా సంపుటిని గురువారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదేశంలో మల్లన్నసాగర్ నిర్మిస్తే భూకంపాలకు దారితీస్తుందని కేంద్ర సంస్థలు హెచ్చరించినా గత ప్రభుత్వం బేఖాతర్ చేసిందన్నారు. ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి న్యాయం జరగలేదన్నారు. ప్రాజెక్ట్‌లో భూములు, ఇండ్లు కోల్పోయి రైతుల జీవితాలను కొండి మల్లారెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. నిర్వాసితుల జీవిత స్థితిగతులపై పుస్తకం రాయం గొప్ప విషయం అని కొనియాడారు. సమావేశంలో హన్మంతరెడ్డి, కీసరి స్వామి, ప్రవీణ్ పాల్గొన్నారు.