ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి : కోటిరెడ్డి

ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి  : కోటిరెడ్డి
  • ఎమ్మెల్సీ కోటిరెడ్డి 

హాలియా, వెలుగు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. శుక్రవారం నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో జరిగిన అలివేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్సీ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

 ఈ సందర్భంగా  కోటిరెడ్డికి వేదపండితులు, ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రామేశ్వరి, నిడమనూరు ప్యాక్స్ డైరెక్టర్ జానయ్యగౌడ్, మాజీ ఎంపీటీసీ నాగేంద్ర నారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.