మిర్యాలగూడలో సీఎంఆర్ఎఫ్​చెక్కుల పంపిణీ

మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ నియోజకవర్గ పరిధికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​చెక్కులను మంగళవారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.