సస్పెండ్ చేస్త.. అధికారులపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆగ్రహం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పనులు చేస్తరా? లేక సస్పెండ్ చేయాలా? యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. ఎన్ని సార్లు చెప్పినా పనులు ఎందుకు చేయడం లేదు. ఏం పీకుతున్నావంటూ  ఓకింత సహనం కోల్పోయారు.  ఈ ఆడియో వైరల్ అవుతోంది. 

 హుజురాబాద్ నియోజకవర్గం  హుజురాబాద్  మండలం జూపాక గ్రామంలో  కాలువ కట్టడంలో జాప్యం చేస్తున్నారంటూ   పంచాయతీ కార్యదర్శి తోటరాజుతో   ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. నెల రోజుల నుంచి చెబుతున్నా పని ఎందుకు చేయడం లేదు,  యూజ్ లెస్ ఫెలో  అంటూ అసభ్య పదజాలంతో కార్యదర్శిపై నోరు పారేసుకున్నారు. పని చేస్తవా లేక నిన్ను సస్పెండ్ చేయాలా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాలువ నిర్మాణానికి గ్రామ పంచాయితీ తీర్మానం ఇవ్వకుంటే తన సొంతడబ్బులిస్తా పని చేయాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు. మళ్లీ మూడు రోజుల్లో గ్రామానికి వస్తానని చెప్పారు.

 మరో గ్రామంలో  ఇంటి గోడ కూలగొట్టేందుకు నోటీసు ఎలా ఇస్తావంటూ మరో అధికారికి వార్నింగ్ ఇస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. 15 ఏళ్లుగా గ్రామంలో ఉంటున్న వాళ్ల  ఇళ్లు మీరెలా కూలగొడతారు? అసలు మీరెవరూ అంటూ సీరియస్ అయ్యారు. ఎక్కడున్నా తన దగ్గరకు రావాలంటూ వార్నింగ్ ఇచ్చారు.