కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలె

కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలె
  • సీఎస్ శాంతికుమారికి పీఆర్టీయూ వినతి 

హైదరాబాద్, వెలుగు: జులై 1 నుంచి కొత్త పే స్కేల్ అమల్లోకి వచ్చేలా కొత్త పీఆర్సీ  కమిషన్ ఏర్పాటు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కోరారు. ఈ నెల30తో ఫస్ట్ పీఆర్సీ కాలపరిమితి ముగుస్తుందని వెల్లడించారు. మంగళవారం వారు సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

లాక్ డౌన్ పరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ 30శాతం ఫిట్​మెంట్ ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో పీఆర్సీని జాప్యం లేకుండా జులై 1 నుంచి అమల్లోకి తెచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు సర్కారు బడుల్లో పారిశుద్ధ్య కార్మికులను కేటాయించాలని కోరారు. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతానని సీఎస్ వారికి హామీ ఇచ్చారు.