అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్ రావులను కలిసిన ఎమ్మెల్సీ మల్లన్న

అసెంబ్లీలో  కేటీఆర్, హరీశ్ రావులను కలిసిన ఎమ్మెల్సీ మల్లన్న

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి సస్సెండ్ అయిన ఎమ్మెల్సీ మల్లన్న బీఆర్ఎస్ నేతలను కలవడం చర్చనీయాంశం అయ్యింది.  ఇవాళ ( సోమవారం, మార్చి 17)  అసెంబ్లీ ఎల్పీలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులతో సమావేశం అయ్యారు మల్లన్న. ఇన్నాళ్లూ బీఆర్ఎస్ నేతలంటే ఉప్పూ నిప్పూ అన్నట్లు ఎగసిపడే మల్లన్న సడెన్ గా కలవడం చర్చలకు దారి తీస్తోంది. 

ఇవాళ (మార్చి 17)  అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టనుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ బిల్లుపై ప్రభుత్వం గట్టిగా మాట్లాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మండలిలో తనకు మద్ధతు తెలపాలని కోరినట్లు తెలుస్తోంది. 

ఇటీవల మల్లన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ స్టాండ్ దాటి కులగణనపై విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అదే విధంగా ఓ వర్గం నేతలను కులం పేరున దూషించడం సంచలనంగా మారింది.  పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ స్పెండ్ చేసిన విషయం తెలిసింది. తాజాగా బీఆర్ఎస్ నేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.