వైసీపీకి బిగ్ షాక్: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా..

వైసీపీకి బిగ్ షాక్: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా..

2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు రాజశేఖర్. 

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడగా.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మర్రి రాజశేఖర్ బుధవారం ( మార్చి 19 ) పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ రాజీనామాతో వైసీపీలో అసంతృప్తుల సంఖ్య ఐదుకు చేరింది.

Also Read:-ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. 

ఇప్పటికే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు రాజీనామా చేయగా.. వీరి బాటలోనే మర్రి రాజశేఖర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి, వైసీపీకి రాజీనామా చేసిన రాజశేఖర్ ఏ పార్టీలో చేరతారన్నది వేచి చూడాలి.