లోకల్‌గా ఉండే భగత్‌ను ఆదరించండి : ఎంసీ కోటిరెడ్డి

హాలియా, వెలుగు :  కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే హైదరాబాద్‌లో ఉంటాడని, నిత్యం ప్రజల మధ్య ఉండే బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కోరారు.  శుక్రవారం నల్గొండ గుర్రంపోడ్ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్​ ప్రజా ఆశీర్వాద సభకు భగత్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   ఓటు వేయాలని గ్రామాల్లోకి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను.. 60 ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేశారో నిలదీయాలన్నారు. భగత్‌ ఎమ్మెల్యేగా గెలిచాకే వెనుకబడి ఉన్న నాగార్జునసాగర్‌‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.

పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే ఉందని,  సమయం వృథా చేయకుండా  బూత్‌ల వారీగా పనిచేయాలని కార్యర్తలకు సూచించారు. భగత్‌ మాట్లాడుతూ.. రైతుబంధు పథకాన్ని ఆపాలని  కాంగ్రెస్  నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.  దీన్ని బట్టే ఎవరికి రైతుల ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. అనంతరం గుర్రంపోడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన  600 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, ఇన్నాళ్లు ఎడమొహం.. పెడమోహంగా ఉన్న ఎమ్మెల్యే నోముల భగత్​, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఒకే వేధికపై కనిపించడం విశేషం.  

ఈ కార్యక్రమంలో ట్రైకార్​ చైర్మన్​ ఇస్లావత్ రాంచంద్రనాయక్, గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, జడ్పీ వైస్​ చైర్మన్​ ఇరిగి పెద్దులు, రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, జడ్పీటీసీ అబ్బీడి కృష్ణారెడ్డి, ఎంపీపీలు మంచి కంటి వెంకటేశ్వర్లు, బొల్లం జయమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల చెన్నారెడ్డి, మార్కెట్ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవాజి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ ధనంజయ, నాయకులు బాణావత్​ బాబురావు నాయక్​ పాల్గొన్నారు.