పీఆర్సీ నివేదిక తెప్పించుకొని, ఫిట్ మెంట్ ప్రకటించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

పీఆర్సీ నివేదిక తెప్పించుకొని, ఫిట్ మెంట్ ప్రకటించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
  • యూటీఎఫ్ మీటింగ్​లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని, వెంటనే పీఆర్సీ ఫిట్ మెంట్ ను ప్రకటించాలని టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్​లో టీఎస్ యూటీఎఫ్ స్టేట్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య అధ్యక్షతన జరిగింది.  జులై 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలిపారు. 

కర్నాటకలో అక్కడి ప్రభుత్వం 27.5% ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పీఆర్సీ ప్రకటించిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించాలని కోరారు. జులై 2022 నుంచి జనవరి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏలకు అనుగుణంగా 4 డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెండింగ్ లోని మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, జీపీఎల్ లోన్లు.. రిలీజ్ చేయాలన్నారు. 

జంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ, స్థానిక సంస్థల టీచర్ల ప్రమోషన్లలో మిగిలిపోయిన ఖాళీలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలన్నారు. బదిలీలలో స్పౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్ల దుర్వినియోగానికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.