చించోడ్, మొగిలిగిద్దను మండలాలుగా ప్రకటిస్తే ప్రభుత్వానికి రూ. 2 కోట్లిస్తా : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

చించోడ్, మొగిలిగిద్దను మండలాలుగా ప్రకటిస్తే ప్రభుత్వానికి రూ. 2 కోట్లిస్తా : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

షాద్ నగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జనవరి 31న మొగిలిగిద్దకు రానున్న నేపథ్యంలో చించోడ్, మొగిలిగిద్దను రెండు మండలాలుగా ప్రకటిస్తే వేదికపైనే ప్రభుత్వానికి రూ.2 కోట్ల చెక్కును అందజేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. 

షాద్​నగర్​లో బుధవారం ఆయన మాట్లాడారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మొగిలిగిద్ద గ్రామాన్ని మండలంగా చేయాలని దీక్ష చేశారని తెలిపారు.