![సీపీఎస్ రద్దు కోసం పోరాడుతా : సర్వోత్తం రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mlc-p-sarvottam-reddy-spoke-at-press-conference-organized-a-bjp-district-office-fight-for-abolition-of-cps_W781ofVlDT.jpg)
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీపీఎస్రద్దు కోసం పోరాడుతానని బీజేపీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పి. సర్వోత్తం రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని బీజేపీ జిల్లా ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది దాటినా విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఐదేండ్ల నుంచి మూడేండ్లకు తగ్గిస్తేనే ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ మనుగడ సాగిస్తాయన్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే టీచర్ల వృత్తికి గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, ఇన్చార్జీలు శ్రీలత, ఎడ్ల అశోక్ రెడ్డి, దేవెందర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్కు ఎమ్మెల్సీ అభ్యర్థి కరువు
ఖమ్మం రూరల్: కాంగ్రెస్ పార్టీ కనీసం ఎమ్మల్సీ అభ్యర్థిని పోటీలో దించే పరిస్థితిలో లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడంలేదనిఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసన మండలిలో నిలదీయడానికి ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీబీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.