కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నాడు. అంబేద్కర్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద న్యూస్ కవరేజ్ కి వెళ్లిన ఓ యూట్యూబ్(GSR) చానెల్ కెమెరా మెన్ ను నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. కెమెరా మెన్ ఫోన్ లాక్కుని తన కారులో తీసుకెళ్లాడు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.
సంక్షేమ పథకాలపై ఓ మహిళ నిలదీస్తున్న సందర్భంగా GSR యూట్యూబ్ చానెల్ కెమెరామెన్ వీడియో తీయడంతో అతడిపై కౌశిక్ రెడ్డి బూతులతో రెచ్చిపోయాడు. అంతేకాదు. GSR చానెల్ ఓనర్ శివరామరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశాడు.
తమ కెమెరామెన్ ను 3 గంటల పాటు తన దగ్గర పెట్టుకుని.. ఇష్టం వచ్చినట్లు కొట్టాడని శివరామరెడ్డి ఆరోపించాడు. ఫోన్ తన దగ్గరే పెట్టుకుని 3 గంటల తర్వాత కెమెరామెన్ ను మాత్రం వదిలేశాడని చెప్పాడు. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఫోన్ లో తనతో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియోలను మీడియాకు విడుదల చేశాడు శివరామరెడ్డి. ప్రస్తుతం ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.