ఎమ్మెల్యేను చేస్తే.. హుజురాబాద్ ను సిద్దిపేటలా చేస్తా : పాడి కౌశిక్

కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో తాను ఎమ్మెల్యే అయితే ఒక స్టెప్ కిందకు దిగినట్టేనని, తనను గెలిపిస్తే హుజురాబాద్ ను మరో సిద్దిపేట చేస్తానని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ నాయకులను హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై చెయ్యి వేస్తే తాట తీస్తానంటూ వ్యాఖ్యానించారు. 

ఇంకా ఏమన్నారంటే..?

‘ఏ సర్కార్ ఆఫీస్ కు వెళ్లిన మనదే నడుస్తుంది. కానీ, మనం దౌర్జన్యం చేయొద్దు. ప్రతిపక్ష నాయకులు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. వెయ్యి కోట్లు తెచ్చుకొని హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. నాకు ఇప్పటికే ఎమ్మెల్సీ, విప్ పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు’ అని పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు.