
బీఆర్ఎస్ లో బుజ్జగింపులు మొదలయ్యాయి. జనగామ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యను కలిసేందుకు హనుమకొండలోని ఆయన ఇంటికి వెళ్లారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే పల్లా ఇంటికి వచ్చే సరికి రాజయ్య ఇంట్లో లేడు. దీంతో ఆయన అనుచరులను కలిశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాజయ్యకు నష్టం జరుగుతుందంటూ పళ్ళా దృష్టికి తీసుకెళ్లారు రాజయ్య అభిమానులు. రాజయ్య రాజకీయ భవిష్యత్ సీఎం కేసీఆర్ చూసుకుంటారంటూ చెప్పారు.
టికెట్ ప్రకటించిన తరువాత మొదటి సారి స్టేషన్ ఘనపూర్ కి వస్తున్న కడియం శ్రీహరికి స్వాగతం పలికేందుకు ఆయన అనుచర వర్గం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రావాలంటూ ఎమ్మెల్యే రాజయ్యకు ఫోన్ చేసి కోరారు రాజేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం వేరే పనిలో ఉన్నా నని మిమ్మల్ని రేపు కలుస్తానంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు రాజయ్య.
ఇటీవల ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కడియం శ్రీహరికి కేటాయించారు కేసీఆర్. దీంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజయ్య నిన్న తన వర్గం నేతల ముందు బోరున విలపించారు. పార్టీనే నమ్ముకున్న తనకు అన్యాయం జరిగిందని ఆవవేదం ్యక్తం చేశారు.