శంషాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని మరోసారి రుజువైందని చీఫ్‌విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లిలో నాలుగు సంక్షేమ పథకాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు.
నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. శంషాబాద్ మండలంలో రేషన్ కార్డుల కోసం 6,224, ఇందిరమ్మ ఇండ్లకు 3,750, రైతు భరోసా కు 262 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరిలో అర్హులకు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.