వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. జులై 17 నుంచి రైతు వేదికల్లో రైతులపట్ల కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలన్న పిలుపు మేరకు కరీంనగర్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
ALSO READ :ఇవ్వని హామీలను సైతం ప్రభుత్వం అందిస్తోంది: ఎమ్మెల్యే జోగు రామన్న
వీణవంక మండల కేంద్రంలో కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం పాడెపై మోసి దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్‌ని గెలిపిస్తే రైతులకు 3 గంటలే కరెంట్ఉంటుందని.. మళ్లీ పాత రోజులు వస్తాయని కౌశిక్ అన్నారు. ఆ పార్టీ నేతలను ప్రజల్లో ఎండగట్టాలని ప్రజలను కోరారు.