
- ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు హెల్త్ కార్డులు ఇప్పించే బాధ్యత తనదని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (పీఎంటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో ‘నల్గొండ’ టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీపాల్ రెడ్డిని సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇప్పిస్తానని హామీనిచ్చారు. నోషనల్ సర్వీస్, ఇంక్రిమెంట్ ఇప్పించడంతో పాటు మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.