సీతక్క వర్సెస్ పోచంపల్లి..ప్రచారంలో గుట్టు విప్పుకుంటున్న నేతలు

సీతక్క వ్యాఖ్యలతో ములుగు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది..ఓటర్లకు కల్తీ సారా, దొంగనోట్లను పంచుతున్నారని సీతక్క చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. సీతక్క చేసిన ఆరోపణలు రుజువు చేయాలి.. దొంగనోట్లు ఎక్కడ ఉన్నాయో చూపాలి అన్నారు. సీతక్కపై ఎన్నికల మిషన్, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ తక్షణ సుమోటో కేసులు నమోదు చేయాలన్నారు. సీతక్క వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని అనుమానించేలా ఉన్నాయన్నారు. సీతక్కు ఓటమి కళ్లముందు కనబడుతుండటంతో ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి విమర్శించారు. 

బీఆర్ఎస్ ను విమర్శించి కర్ణాటక, ఛత్తీస్ గఢ్ నుంచి వందలకోట్లు చందాలు తెచ్చుకుంటోందని విమర్శించారు. కరోనా కష్టాన్ని కరెన్సీగా మార్చుకున్న చరిత్ర సీతక్కదని ఆయన ఆరోపించారు. నన్ను కేసీఆర్, కేటీఆర్ లకు బినామా అని ఆరోపణలు చేస్తున్న సీతక్క.. ములుగు సెంటర్లో చర్చకురావాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో సీతక్క చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. 

Also Read :- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి