
చేవెళ్ల, వెలుగు: కోడి పందెం కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరో సారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హజరు కావాలని గురువారం మాదాపూర్ లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్ట లో శ్రీనివాస్ రెడ్డికి చెందిన వ్యవవసాయ క్షేత్రం లో గత నెల 11న రాత్రి పెద్ద ఎత్తున కోడి పందెలు నిర్వహిస్తుండటంతో ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో గత నెల 19న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కి నోటీసులు ఇచ్చారు. అప్పట్లో ఆయన విచారణకు హాజరు కాకుండా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని పోలీసులు మరో సారి విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.