బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తోనే ములుగు అభివృద్ధి : శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

ములుగు, వెలుగు : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌తోనే రాష్ట్రం, ములుగు జిల్లా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి చెప్పారు. ములుగు జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌‌‌‌ వద్ద రెడ్కో చైర్మన్‌‌‌‌ వై.సతీశ్‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ములుగు, వెంకటాపూర్‌‌‌‌ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ నాయత్వంలోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మల్లంపల్లి మండలం, ఏటూరునాగారం డివిజన్‌‌‌‌తో పాటు ఫైర్‌‌‌‌స్టేషన్‌‌‌‌ ఏర్పాటు హామీని నిలబెట్టుకున్న ఘనత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌దేనన్నారు.

వచ్చే ఎన్నికల్లో సైతం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు, ఎంబీసీ కులాల సంఘం జిల్లా అధ్యక్షుడు బాణాల రాజ్‌‌‌‌కుమార్‌‌‌‌తో పాటు మరికొందరు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ పోరిక గోవింద్‌‌‌‌నాయక్‌‌‌‌, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్‌‌‌‌రాంనాయక్‌‌‌‌, పీఏసీఎస్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ బైకానిసాగర్‌‌‌‌ పాల్గొన్నారు.