కాంగ్రెస్‌‌‌‌కు పరాభవం తప్పదు : పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

మంగపేట, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌కు ఘోర పరాభవం తప్పదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌ వారంటీ లేని గ్యారంటీ పథకాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఎదుర్కొనే శక్తి లేక రైతు బీమా, పెన్షన్లు, రైతు బంధు వంటి పథకాలను నిలిపివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కనీసం రెండు, మూడు గంటలు కూడా ఉచిత విద్యుత్‌‌‌‌ ఇవ్వడం లేదన్నారు.

ములుగులో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ బడే నాగజ్యోతిని గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్, కాకులమర్రి లక్ష్మణ్‌‌‌‌బాబు, వత్సవాయి శ్రీధర్‌‌‌‌వర్మ, కుడుముల లక్ష్మీనారాయణ, తోట రమేశ్‌‌‌‌ ఉన్నారు. అంతకుముందు మల్లూరులోని హేమాచల లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ నూతులకంటి ముకుందం, అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశా