సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తన ఆవేదనను బయటపెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గందరగోళంగా మారాయన్నారు. వ్యక్తిగత ఎజెండాతో కొందరు నేతలు పార్టీకి నష్టం కల్గిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకువెళ్లానని చెప్పిన పొంగులేటి సుధాకర్ రెడ్డి.. రాష్ట్ర నేతలు.. పార్టీ నాయకులకు మర్యాద ఇవ్వడం లేదన్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించలేకపోతున్నారని అన్నారు. బాధ్యతను నిర్వర్తించడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని చెప్పారు.
“నాకు కూడా మనోవేదన కల్గించే ఘటనలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర కాంగ్రెస్ ఫెయిలైంది. నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అన్నారు పొంగులేటి సుధాకర్ రెడ్డి.