ఖాళీ అవుతోన్న వైసీపీ.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

అధికారం కోల్పోయి ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలకు, కార్యకర్తలకు వరుస షాకులు తగులుతున్నాయి. కష్టకాలంలో అందరూ ఒక్కటై అధినేతకు తోడుగా ఉంటారనుకుంటే.. నేతలు మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒకవైపు జగన్ మెహన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడనున్నారని వార్తలు గుప్పుమంటుండగానే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. 

పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మెహన్ రెడ్డికి పంపినట్లు తెలుస్తోంది. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె తెలిపారు. ప్రస్తుతం పోతుల సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు. త్వరలోనే ఆమె టీడీపీ గూటికి చేరనున్నట్లు సమాచారం.

టీడీపీకి బై బై చెప్పి వైసీపీలోకి.. 

కాగా, 2017లో టీడీపీ తరపున ఎమ్మెల్సీ ఎన్నికైన పోతుల సునీత.. చంద్రబాబుతో విభేదించి 2020లో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని మెచ్చి పార్టీలో చేరారు. ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్లీ సొంత గూటికి చేరుతోంది.