మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండ రామ్ కోరారు. మహబూబాబాద్జిల్లా గార్ల మండలంలోని మున్నేరువాగును గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మహబూబాబాద్నలంద కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు. మున్నేరుపై హైలేవల్ బ్రిడ్జి లేకపోవడంతో మండలంలోని 25 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డోలి సత్యనారాయణ, అంబడి శ్రీనివాస్, సుధాకర్, గోపగాని శంకర్రావు, మురళి, తారక రామారావు తదితరులు ఉన్నారు.