ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తా: ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం

ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తా: 	ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం

బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడలో  తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

  తెలంగాణ జన సమితి నేత గోనెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మంది ఉద్యమకారులను శాలువ, పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు, ఇంటి స్థలాలు, పెన్షన్లు అందించేలా కృషి చేయాలని కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తగిన న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

కార్యక్రమంలో ఉద్యమకారులు కొమ్ముల బాపన్న, శిలోజు మురళి, దుర్గం గోపాల్, గోనెల శ్రీనివాస్, నవభారత్ శంకర్, ఆత్రం సంజీవ్, తట్ర భీమ్రావు, భాగ్యలక్ష్మి, దుర్గం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.