ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఉంటా... ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా ఉంటా... ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రభుత్వానికి తాను వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. మంగళవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాంను ఘనంగా సన్మానించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. పెండింగ్​ఐదు డీఏలు, హెల్త్ కార్డు, పీఆర్సీ అంశాలను తన దృష్టికి వచ్చాయన్నారు.

సీఎంతో మాట్లాడి పరిష్కరించేలా కృషి  చేస్తామన్నారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దసరా కానుకగా కనీసం మూడు డీఏలను విడుదల చేయాలని కోరారు.