వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఎప్పుడు.. జున్ను, స్వీట్లతో రెడీగా ఉన్నారు: ఎమ్మెల్సీ రమేష్ సెటైర్లు

వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఎప్పుడు.. జున్ను, స్వీట్లతో రెడీగా ఉన్నారు: ఎమ్మెల్సీ రమేష్ సెటైర్లు

2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వాలంటీర్లకు జీతం రూ.10 వేలు ఇస్తామంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కానీ.. వాలంటీర్ల ఉద్యోగాలు రెన్యూవల్ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే అంశాన్ని సోమవారం ( మార్చి 17 ) శాసనమండలిలో ప్రస్తావించారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. తమకు రూ. 10 వేలు జీతం ఎప్పుడిస్తారని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది వాలంటీర్లు జున్ను స్వీట్లతో ఎదురుచూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

ఎన్నికలక ముందు ప్రచారంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు వాలంటీర్లతో అన్న మాటలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఎమ్మెల్సీ రమేష్. గత ప్రభుత్వ హయాంలో జీవో ప్రకారం నియమించబడ్డ వాలంటీర్ల భవిష్యత్తుతో ఆడుకుంటోందని.. విజయవాడ వరదల సమయంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థనే చట్టబద్దం కాదని అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ రమేష్. 

Also Read:-వాలంటీర్లను కొనసాగించటం లేదు : షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం