
మెదక్ టౌన్, వెలుగు : కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే రేషన్ కార్డులను రద్దు అవుతాయని ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూచన్‌పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల రేషన్ కార్డులు రద్దు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల కోసం ఉంచిన ఏడు వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పంచి పెట్టారని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, హవేళీ ఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కసిరెడ్డి మాణిక్య రెడ్డి, ఎంపీటీసీలు దుర్గారావు, రాధాకిషన్, నాయకులు సతీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.