
కోల్‌బెల్ట్, వెలుగు: మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా మాలమహానాడు కమిటీ నిరసన చేపట్టింది. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌విగ్రహం వద్ద లీడర్లు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వం దళితులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్సర్కార్ మొదట దయాకర్‌కు ఎమ్మెల్సీ ప్రకటించి తర్వాత ఉపసంహరించుకోవడం సరికాదన్నారు. అగ్రవర్ణాల కుట్రలతో ఎమ్మెల్సీ రాకుండా చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవచూపి వెంటనే దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు అంబేద్కర్‌విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రెసిడెంట్ గజ్జెల్లి లక్ష్మణ్, జై భీం సైనిక్ దళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ పురుషోత్తం, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పాల్తెపు శంకర్, జిల్లా జనరల్ సెక్రటరీ ఎర్రోళ్ల నరేశ్, వైస్ ప్రెసిడెంట్మార్త కుమారస్వామి, సెక్రటరీ గోక శ్రీనివాస్, అధికార ప్రతినిధి నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.