
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కోరారు. గురువారం సెక్రటేరియెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్ రెడ్డితో పాటు మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. టీచర్ల బిల్లులు చాలాకాలంగా పెండింగ్లో ఉన్నాయని, వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని, ఇక నుంచి బిల్లులను రెగ్యులర్గా చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పీఆర్టీయూ నేతలు అబ్దుల్ గఫార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.