మే నెలలో టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

మే నెలలో టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వాలి..సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు టీచర్లతో పాటు మోడల్ స్కూల్, గురుకులాల్లోని టీచర్లకు వచ్చే వేసవి సెలవుల్లో బదిలీలు, ప్రమోషన్లు కల్పించాలని కొత్తగా ఎన్నికైన టీచర్ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

 గురువారం ఆయన అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పి.దామోదర్ రెడ్డితో పాటు కలిసి వినతిపత్రం అందించారు.  స్కూల్ వర్కింగ్ డేస్​కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మే నెలలో బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి.. ఈ అంశంపై తగుచర్యలు తీసుకునేలా సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్​ను ఆదేశించాలన్నారు.